![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -271 లో....రామరాజుకి కళ్యాణ్ ఫోన్ చేసి.. నా పేరు కళ్యాణ్, నేను ప్రేమ ప్రేమించుకున్నామని కళ్యాణ్ అంటాడు. అప్పుడే కళ్యాణ్ వెనకలా నుండి ధీరజ్ వచ్చి కళ్యాణ్ ని కొడతాడు. మావయ్య గారు ఆ కళ్యాణ్ ఎవరని శ్రీవల్లి అనగానే.. ఎవరు లేదు మీరు అందరు లోపలికి వెళ్ళండి అని రామరాజు అంటాడు. అందరు వెళ్తారు. మరోవైపు కళ్యాణ్, ధీరజ్ మాట్లాడుకుంటారు. మీ నాన్నకి నిజం చెప్పేసానని కళ్యాణ్ అనగానే ధీరజ్ టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఆ రోజు ప్రేమ, ధీరజ్ పెళ్లి చేసుకునే కంటే ముందు ఏదో జరిగి ఉంటుంది. నీకు ఏమైనా తెలుసా అని నర్మదని సాగర్ అడుగుతాడు. నాకేం తెలియదని నర్మద కవర్ చేస్తుంది.
ఆ తర్వాత చందుతో శ్రీవల్లి గురించి ప్రేమ తప్పుగా మాట్లాడుతుంటే ప్రేమని చిన్నప్పటి నుండి చూస్తున్నాం.. తను మంచిది నువ్వు ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని శ్రీవల్లితో చందు అంటాడు. ఆ తర్వాత భాగ్యంకి శ్రీవల్లి జరిగిందంతా చెప్తుంది. ఇక ఆ ఇంట్లో ఏ గొడవ చెయ్యాలో నాకు తెలుసని భాగ్యం అనుకుంటుంది. మరొకవైపు వేదవతిని రామరాజు పక్కకి తీసుకొని వెళ్లి అసలేం జరుగుతుంది ఈ అబ్బాయి ఎవరని రామరాజు అడుగుతాడు. కానీ వేదవతి ఏం చెప్పదు.
ప్రేమకి వేదవతి ఫోన్ చేసి త్వరగా ఇంటికిరా అని చెప్తుంది. మరొక వైపు భద్రవతి, విశ్వ ఇద్దరు భాగ్యం ఇంటికి వస్తారు. ఎందుకు రమ్మన్నావని భద్రవతి అడుగగా.. మీ ప్రేమ ఎవరితోనో ఫోటో దిగిందట.. పెళ్లికి ముందే ప్రేమ తప్పు చేసిందని అంటున్నారట అని భాగ్యం చెప్పగానే భద్రవతి, విశ్వ షాక్ అవుతారు. తరువాయి భాగంలో ప్రేమ ఇంటికి రాగానే రామరాజు ఫొటోస్ చూపించి ఎవరు ఇతను అని అడుగుతాడు అప్పుడే భద్రవతి కుటుంబం మొత్తం రామరాజు ఇంటికి గొడవకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |